చేవెళ్ల కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ అభ్యర్థిగా రంజిత్‌‌‌‌ రెడ్డి నామినేషన్‌‌‌‌

గండిపేట, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్‌‌‌‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థిగా గడ్డం రంజిత్‌‌‌‌రెడ్డి మంగళవారం నామినేషన్‌‌‌‌ దాఖలు చేశారు. రాజేంద్రనగర్‌‌‌‌లోని తహసీల్దార్‌‌‌‌ కార్యాలయంలో రిటర్నింగ్‌‌‌‌ అధికారి, కలెక్టర్‌‌‌‌ శశాంకకు నామినేషన్‌‌‌‌ పత్రాలు అందజేశారు. 

హనుమాన్‌‌‌‌ జయంతి సందర్భంగా మంచి రోజు కావడంతో మంగళవారం ఒక సెట్‌‌‌‌ నామినేషన్‌‌‌‌ దాఖలు చేశానని, ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25న మరో సెట్‌‌‌‌ దాఖలు చేయనున్నట్టు రంజిత్‌‌‌‌రెడ్డి తెలిపారు. ఆ రోజు 50 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీ నిర్వహించి నామినేషన్‌‌‌‌ వేస్తానని ఆయన చెప్పారు.