అనంతగిరి సందర్శణకు రండి .. గవర్నర్​ను ఆహ్వానించిన అసెంబ్లీ స్పీకర్

వికారాబాద్, వెలుగు: తన నియోజకవర్గంలోని తెలంగాణ కశ్మీర్​ అయిన అనంతగిరిని, మూసీ నది జన్మస్థలాన్ని, అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించాలని రాష్ట్ర గవర్నర్​జిష్ణుదేవ్​వర్మను అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​ఆహ్వానించారు.​ 

సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్​ఆహ్వానానికి గవర్నర్​సానుకూలంగా స్పందించారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఇరువురు ఢిల్లీ వెళ్లగా, అక్కడి తెలంగాణ భవన్ లో కలుసుకున్నారు.