మాలల చైతన్య సమితి జిల్లా అధ్యక్షుడిగా రాంగోపాల్

వనపర్తి, వెలుగు: మాలల చైతన్య సమితి వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా గడమాల రాంగోపాల్​ను నియమించారు. ఆదివారం పాలిటెక్నిక్​ కాలేజీ ఆవరణలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూలె కేశవులు, రాష్ట్ర వర్కింగ్  ప్రెసిడెంట్  మద్దెల రామదాసు​మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆర్టికల్  341 సవరణ చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

 జిల్లా ఉపాధ్యక్షుడిగా  ఇమ్మడి సైదులు, ప్రధాన కార్యదర్శిగా ఏటూరి రాజు, ట్రెజరర్​గా బాపనపల్లి విజయ్ కుమార్, సహాయ కార్యదర్శిగా యశోద రాంబాబు, ప్రచార కార్యదర్శిగా ఏటూరి రవి, కార్యనిర్వాహక కార్యదర్శిగా బిజ్జ నరేశ్,  అధికార ప్రతినిధిగా అన్నల్ దాస్  మాసయ్య, సలహాదారుగా బాపనపల్లి చంద్రబాబును నియమించారు.