ఇప్పుడంతా డిజిటల్ యుగం. బయటికెళ్తే చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. ఫోన్ ఉంటే చాలు.. అనే స్థితికి వచ్చాం. ఎక్కడికెళ్లినా డిజిటల్ పేమెంట్సే.. నగదు వినియోగించేవారు రోజురోజుకూ తగ్గిపోతున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే పనిలో భాగంగా వచ్చిన జీ పే, ఫోన్ పే, పేటీఎమ్ లాంటి ఎన్నో మనీ ట్రాన్స్ ఫర్ ఆర్ రిసీవింగ్ యాప్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటిలో వేటికవే ప్రత్యేకం. రోజుకో అప్ డేట్ తో వినియోగదారులను ఆకర్షిస్తూ.. రేటింగ్ ను కూడా పెంచుకుంటున్నాయి ఈ యాప్స్. ఈ నేపథ్యంలో జీ పే కూడా ఓ కొత్త అప్ డేట్ కు తెరలేపింది. ఇప్పటివరకూ ఈ యాప్ ఆంగ్లం, తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళం భాషల్లో సపోర్ట్ చేస్తుండగా.. ఇప్పుడు తెలుగులోనూ సేవలందించేందుకు సిద్ధమైంది.
తెలుగులోకి మార్చుకోవటం ఎలా?
- జీపే యాప్ ను ఓపెన్ చేసి ప్రొఫైల్ గుర్తు మీద ట్యాప్ చేయాలి.
- సెటింగ్స్ ద్వారా పర్సనల్ ఇన్ఫో ఆప్షన్లోకి వెళ్లాలి.
- అప్పుడు లాంగ్వేజ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
- ఇందులో తెలుగును ఎంచుకుంటే సరి. వెంటనే యాప్ భాష తెలుగులోకి మారిపోతుంది.
