పెబ్బేరు సంత స్థలాన్ని కాపాడుతాం : జి.చిన్నారెడ్డి

పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు సంత స్థలం విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి స్థలాన్ని కాపాడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి తెలిపారు. గురువారం పెబ్బేరుకు వచ్చిన ఆయన కాంగ్రెస్​  నాయకులతో సంత స్థలం వివాదంపై చర్చించారు. 

దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో ఈ విషయంపై చర్చిస్తానని చెప్పారు. సంత స్థలాన్ని కాపాడి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. వెంకట్రాములు, విజయవర్ధన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, రవీందర్ నాయుడు, ఈశ్వర్ రెడ్డి, రాముడు, దేవన్న గౌడ్, రాజు, రాజు గౌడ్, భరత్ కుమార్, జి అంజి, వడ్డె అంజి, ఖాసీం, మేఘారెడ్డి, దయానంద్  పాల్గొన్నారు.