కేఎస్‌‌‌‌జీ వర్సిటీ బాస్కెట్‌‌‌‌బాల్‌‌‌‌ చాంప్స్‌‌‌‌ ఫ్యూచర్‌‌‌‌ కిడ్స్‌‌‌‌, ఓక్రిడ్జ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేఎస్‌‌‌‌జీ వర్సిటీ బాస్కెట్‌‌‌‌బాల్‌‌‌‌ స్కూల్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఫ్యూచర్‌‌‌‌ కిడ్స్‌‌‌‌, ఓక్రిడ్జ్‌‌‌‌ జట్లు విజేతలుగా నిలిచాయి. సోమవారం మదాపూర్‌‌‌‌లో జరిగిన గర్ల్స్ ఫైనల్లో ఫ్యూచర్‌‌‌‌ కిడ్స్‌‌‌‌ స్కూల్‌‌‌‌ టీమ్ 46–-28తో డీపీఎస్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌పై ఘన విజయం సాధించింది. బాయ్స్‌‌‌‌ ఫైనల్లో ఓక్రిడ్జ్‌‌‌‌ గచ్చిబౌలి జట్టు 80–-65తో చిరెక్‌‌‌‌ కొండాపూర్‌‌‌‌ టీమ్‌‌‌‌ను ఓడించి ట్రోఫీ గెలిచింది.

కంకణాల స్పోర్ట్స్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ (కేఎస్‌‌‌‌జీ) ప్రమోటర్‌‌‌‌ అభిషేక్‌‌‌‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విన్నర్లకు ట్రోఫీలు అందజేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్ లెవెల్‌‌‌‌ నుంచే బాస్కెట్‌‌‌‌బాల్‌‌‌‌ క్రీడాకారులను గుర్తించి వారిని ఇంటర్నేషనల్ లెవెల్‌‌‌‌కు  తీసుకెళ్లే లక్ష్యంతో  ‘కేఎస్‌‌‌‌జీ వర్సిటీ బాస్కెట్‌‌‌‌బాల్‌‌‌‌ లీగ్‌‌‌‌’ను ప్రారంభించామని తెలిపారు.  ఈ లీగ్‌‌‌‌లో 55 స్కూల్స్‌‌‌‌ నుంచి దాదాపు 600 మంది ప్లేయర్లు పోటీ పడ్డారని వెల్లడించారు.