మాల్యాను రప్పించాలంటే మరిన్ని లీగల్‌ ఇష్యూలు క్లియర్‌‌ అవ్వాలి

మాల్యాను రప్పించాలంటే మరిన్ని లీగల్‌ ఇష్యూలు క్లియర్‌‌ అవ్వాలి
  • వెల్లడించిన బ్రిటిష్‌ హై కమిషన్‌

న్యూఢిల్లీ: విజయ్‌ మాల్యాను మన దేశానికి తీసుకురావాలంటే ఇంకా కొన్ని లీగల్‌ ఇష్యూలు క్లియర్‌‌ అవ్వాల్సి ఉన్నాయని బ్రిటిష్‌ హై కమిషన్‌ ఒక జాతీయ మీడియా ఛానల్‌తో చెప్పింది. ఆ ఇష్యూ ఏంటనేది కాన్ఫిడెన్షియల్‌ అని చెప్పింది. “ మాల్యా తనను ఇండియాకు అప్పగించాలనే నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూకే సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. అది రిజెక్ట్‌ అయింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని ఇష్యూలు క్లియర్‌‌ చేయాల్సి ఉంది. అది ఎన్ని రోజులు పట్టొచ్చు అనే విషయం చెప్పలేం. వీలైనంత త్వరగా దాన్ని క్లియర్‌‌ చేయాలని చూస్తున్నాం” అని బ్రిటిష్‌ హై కమిషన్‌ అధికార ప్రతినిధి అన్నారు.మాల్యాను ఇండియాకు అప్పగించేందుకు అంగీకరిస్తూ లండన్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా ఆయన్ను ఎప్పుడైనా ఇక్కడికి తీసుకొస్తామని అధికారులు ప్రకటించారు. ఇండియా బ్యాంకులకు రూ.900 కోట్లు ఎగ్గొట్టిన విజయ్‌మాల్య లండన్‌ పారిపోయారు.