తొలి 6 నెలల్లో రూ.3,500 కోట్లు
బెస్ట్ పర్ఫార్మింగ్ అసెట్‌గా రికార్డు
న్యూఢిల్లీ : గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్(ఈటీఎఫ్) లలోకి ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో రూ.3,500 కోట్ల ఇన్‌ఫ్లోస్ వచ్చాయి. కరోనా క్రైసిస్‌తో బంగారాన్ని సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా భావించి, భారీ మొత్తంలో పెట్టు బడులు పెట్టారు. ఇదే కాలంలో జనవరి– జూన్ మధ్య కాలంలో ఈ అసెట్ క్లాస్ నుంచి రూ.160 కోట్ల మనీనే ఇన్వెస్టర్లు బయటికి తీశారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఆమ్ఫీ) డేటాలో ఈ విషయం వెల్ల డైంది. గతేడాది నుంచి గోల్డ్ ఈటీఎఫ్‌లు బెస్ట్ పర్‌ఫార్మింగ్ కేటగిరీగా నిలుస్తున్నాయి. 2019 ఆగస్ట్ నుంచి గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.3,723 కోట్లను పొందాయి. వీటిలో రూ.3,530 కోట్లుఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలోనే వచ్చినట్టు తెలిసింది. నెలవారీ డేటా తీసుకుంటే, జనవరిలో రూ.202 కోట్లను, ఫిబ్రవరిలో రూ.1,483 కోట్లను ఇన్వెస్టర్లు గోల్డ్ లింక్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేశారు. మార్చిలో ప్రాఫిట్ బుకింగ్ కు పాల్పడటంతో రూ.195 కోట్లను వెనక్కి తీసుకున్నారు.
