అప్పులకు ఫుల్ డిమాండ్​!

అప్పులకు ఫుల్ డిమాండ్​!
పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది ట్రాన్స్‌‌‌‌యూనియన్ సిబిల్ రిపోర్ట్ వెలుగు, హైదరాబాద్: క్రెడిట్ డిమాండ్ ఇటీవల కాలంలో పెరుగుతున్నట్టు ట్రాన్స్‌‌‌‌యూనియన్ సిబిల్ ఇండస్ట్రీ ఇన్‌‌‌‌సైట్స్ రిపోర్ట్ తెలిపింది. కరోనా షాక్ తర్వాత ఇటీవల కాలంలో రిటైల్ క్రెడిట్ ప్రొడక్ట్‌‌‌‌లు(అప్పులు) స్థిరంగా పెరుగుతున్నట్టు పేర్కొంది. ఇయర్ ఆన్ ఇయర్ పరంగా తీసుకుంటే మాత్రం ఇంకా కరోనా ముందటి స్థాయిలకు చేరాల్సి ఉందని తెలిపింది. క్రెడిట్ డిమాండ్‌‌‌‌లో ప్రస్తుతం పాజిటివ్ ట్రెండే కనిపిస్తోందని వివరించింది. 2019 నవంబర్‌‌‌‌‌‌‌‌ లెవెల్స్‌‌‌‌లో 93 శాతానికి ఈ ఏడాది నవంబర్ నెల రిటైల్ క్రెడిట్ డిమాండ్ చేరుకుంది. కరోనా మహమ్మారితో ఈ ఏడాది ప్రారంభంలో క్రెడిట్ డిమాండ్ కనిష్ట స్థాయిలకు పడిపోయిన సంగతి తెలిసిందే. ‘గ్లోబల్ ఎకానమీ ఇంకా కరోనా ప్రభావంతో సతమతమవుతోంది. బిజినెస్‌‌‌‌లు, కన్జూమర్లు ఈ ఛాలెంజింగ్ పరిస్థితులను అడాప్ట్ చేసుకోవడం నేర్చుకున్నారు. ఈ ఏడాది ఇనీషియల్ లాక్‌‌‌‌డౌన్ నుంచి చూసుకుంటే ప్రస్తుతం క్రెడిట్ డిమాండ్‌‌‌‌లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. పెద్ద మొత్తంలో కొనుగోళ్లకు కన్జూమర్లు అప్పులు తీసుకుంటున్నారు’ అని ట్రాన్స్‌‌‌‌యూనియన్ సిబిల్ కన్సల్టింగ్ అండ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అభయ్ కేల్కర్ చెప్పారు. వడ్డీ రేట్లు తగ్గడంతో పాటు పేమెంట్ స్కీమ్స్‌‌‌‌ ఆకర్షణీయంగా మారడంతో మేజర్ క్రెడిట్ ప్రొడక్ట్‌‌‌‌లకు ఎంక్వైరీ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. క్రెడిట్ కార్డుల డెలింక్వెన్సీ రేట్స్ పెరిగాయ్! అయితే కొత్త క్రెడిట్ సప్లయి మాత్రం 2020 ఆగస్ట్‌‌‌‌లో తగ్గింది. అన్ని మేజర్ రిటైల్ కేటగిరీల్లో కూడా క్రెడిట్ సప్లయి తగ్గినట్టు ట్రాన్స్‌‌‌‌యూనియన్ సిబిల్ పేర్కొంది. ఉద్యోగాల కోత, వేతన తగ్గింపు, ఎకనమిక్ స్లోడౌన్ వంటి కారణాలతో క్రెడిట్ కార్డుల, ప్రాపర్టీలపై తీసుకున్న లోన్ల డెలింక్వెన్సీ రేట్స్(వాయిదాల చెల్లింపును ఆలస్యం చేయడం) పెరిగాయి. క్రెడిట్ కార్డుల డెలింక్వెన్సీ రేట్స్ 51 బేసిస్ పాయింట్లు, ఎల్‌‌‌‌ఏపీల డెలింక్వెన్సీ రేట్స్ 34 బేసిస్ పాయింట్లు పెరిగినట్టు తేలింది. క్రెడిట్ కార్డులు తక్కువ పేమెంట్ ప్రయార్టీ కావడంతో చాలా మంది ఇతర అప్పులను క్లియర్ చేసుకునేందుకు చూశారు. కరోనా మహమ్మారి లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో చాలా చిన్న వ్యాపారాలకు క్యాష్‌‌‌‌ ఫ్లోలు తగ్గిపోయాయి. అయితే ఆటో లోన్స్‌‌‌‌లో డెలింక్వెన్సీస్ రేట్స్ ఇయర్ ఆన్ ఇయర్ 2.91 శాతం తగ్గి 23 బేసిస్ పాయింట్లకు దిగొచ్చింది. కరోనాతో పర్సనల్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ తప్పనిసరిగా భావించడంతో కన్జూమర్లు ఆటో లోన్ పేమెంట్లను రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా చేశారు. పర్సనల్ లోన్స్‌‌‌‌లో డెలింక్వెన్సీ రేట్  కాస్తనే మెరుగుపడింది. ఫైనాన్షియల్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ కన్జూమర్లకు బాగా సాయం చేసినట్టు అభయ్ కేల్కర్ అన్నారు. For More News.. ఐసీసీ టీ20 బ్యాట్స్‌‌మెన్‌‌ ర్యాంక్ మెరుగుపరచుకున్న కోహ్లీ కరోనా టైంలోనూ విదేశీ పెట్టుబడులు ఆగలేదు లాక్‌డౌన్‌లో పానీ పూరికి 2 లక్షల ఆన్‌లైన్‌ ఆర్డర్లు