రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్

రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్
రూ. 50 లక్షలలోపు ఇండ్లనే కొంటున్నరు నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ సిటీలో పెరిగిన కొత్త లాంచ్‌లు ధరల్లో పెద్దగా మార్పేమీ లేదు కిరాయిలు తగ్గలేదు హైదరాబాద్ మార్కెట్ హెల్తీగా ఉంది ఆఫీసు స్పేస్‌కు డిమాండ్ వస్తోంది.. హైదరాబాద్​లో రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇండ్లకు బాగా డిమాండ్ వస్తున్నట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్‌‌ ఇండియా రిపోర్ట్ తెలిపింది. సిటీలో 2020 తొలి ఆరు నెలలతో పోలిస్తే చివరి ఆరు నెలల్లో రెండింతలు మేర కొత్త లాంచ్‌‌లు పెరిగాయని తెలిపింది.  కరోనా ఎఫెక్ట్​ ఉన్నప్పటికీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరల్లో పెద్దగా మార్పేమీ రాలేదని, హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లు చాలా హెల్తీగా ఉన్నాయని తెలిపింది. ఆఫీసు స్పేస్‌‌కు మంచి డిమాండ్ ఉందని, రెంట్లు ఏ మాత్రం తగ్గలేదని వెల్లడించింది. హైదరాబాద్, వెలుగు: సిటీలో రూ. 50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇండ్లకు బాగా డిమాండ్ వస్తోంది. మధ్యతరగతి ప్రజలు ఈ కేటగిరి ఇళ్ల వైపు చూస్తుండడంతో వీటి అమ్మకాలు పెరుగుతున్నాయి. అంతేకాక నగరంలో కొత్త లాంచ్‌‌లు పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్‌‌ ఇండియా రిపోర్ట్ తెలిపింది. 2020 తొలి ఆరు నెలల(హెచ్‌1)తో పోలిస్తే చివరి ఆరు నెలల్లో(హెచ్2 లో) రెండింతలు మేర కొత్త లాంచ్‌‌లు పెరిగాయని తెలిపింది. కరోనా మహమ్మారితో హెచ్‌‌1 2020లో కొత్త లాంచ్‌‌లు 45 శాతం తగ్గగా.. చివరి ఆరు నెలలు మాత్రం 90 శాతం పెరిగాయని రిపోర్ట్ చేసింది.  ‘ఇండియా రియల్ ఎస్టేట్ రెసిడెన్షియల్ అండ్ ఆఫీసు అప్‌‌డేట్ హెచ్‌‌2 2020’ పేరుతో నైట్‌‌ ఫ్రాంక్ 14వ రిపోర్ట్‌‌ను విడుదల చేసింది. జూలై నుంచి డిసెంబర్‌‌‌‌ వరకు ఎనిమిది ప్రధాన నగరాల్లో సేల్స్ ఎలా ఉన్నాయి? ధరల్లో ఎలాంటి మార్పు వచ్చింది? మార్కెట్‌‌ పరిస్థితులను ఈ రిపోర్ట్‌‌లో వివరించింది. దేశంలో టాప్ 8 నగరాల్లో 2020 చివరి ఆరు నెలలు ఇండ్ల అమ్మకాలు 94,997 యూనిట్లుగా ఉంటే.. వాటిలో 57 శాతం రూ.50 లక్షలున్న ఇండ్లే  ఉన్నట్టు పేర్కొంది. ఏడాది లెక్కన తీసుకుంటే  2020లో టాప్ 8 సిటీల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల సేల్స్ 37 శాతం తగ్గి 1,54,534 యూనిట్లుగా ఉన్నాయి. కిందటేడాది ఇవి 2,45,861 యూనిట్లుగా రికార్డయ్యాయి. అయితే ప్రీ కరోనా లెవెల్స్‌‌ దగ్గరికి రెసిడెన్షియల్ సేల్స్ వస్తున్నాయని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ చెప్పింది. హైదరాబాద్‌‌లో కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరల్లో పెద్దగా మార్పేమీ రాలేదని నైట్ ఫ్రాంక్ ప్రతినిధులు వివరించారు. హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లు చాలా హెల్తీగా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌‌లో 2020 చివరి క్వార్టర్‌‌‌‌లో(చివరి మూడు నెలల్లో) రెసిడెన్షియల్ మార్కెట్ సేల్స్ రికవరీ అయినట్టు హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ చెప్పారు. 2020లో మొత్తంగా హైదరాబాద్‌‌లో 10,042 ఇండ్లు అమ్ముడుపోతే.. వాటిలో క్యూ4లోనే 3,651 ఇండ్లు సేల్ అయ్యాయి. క్వార్టర్ లెక్కన తీసుకుంటే ముందు క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే క్యూ4లో 127 శాతం సేల్స్ పెరిగాయి.  చివరి ఆరు నెలలు తీసుకున్నా సేల్స్ 10 శాతం పెరిగినట్టు చెప్పారు. ఏడాది లెక్కనే సేల్స్ 38% తగ్గాయని తెలిపారు. కరోనాతో యాన్యువల్ సేల్స్‌‌కు దెబ్బకొట్టినట్టు వివరించారు. 2020 చివరి ఆరు నెలల్లో రెసిడెన్షియల్ డిమాండ్‌‌ పెరిగిందని, ముఖ్యంగా క్యూ4లో బాగా డిమాండ్ వచ్చినట్టు చెప్పారు. ఫెస్టివ్ సీజన్ ప్రమోషన్లు, కరోనా తర్వాత డెవలపర్లు ఆఫర్లు ప్రకటించడం, బెటర్ లేఅవుట్లతో ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌‌తో పాటు పిల్లలకు ఆన్‌‌లైన్‌‌ చదువులెసాగుతుండటం వల్ల ప్రతి ఒక్కరూ సొంతంగా ఇల్లు కావాలని చూస్తున్నారు. రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇండ్ల సేల్స్ హైదరాబాద్‌‌లో 15 శాతం నుంచి 24 శాతానికి పెరిగాయి. ‘హైదరాబాద్ ఆఫీసు మార్కెట్ 2020 క్యూ4లో బాగా రికవరీ అయింది. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ రెంట్లు మారలేదు. వ్యాక్సిన్ వస్తుండటంతో పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలు వారి లీజ్ ప్లాన్లను ఎగ్జిక్యూట్ చేసేందుకు చూస్తున్నాయి. గోల్డ్ మ్యాన్ శాచ్స్‌‌ హైదరాబాద్‌‌లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించడం ఆఫీసు సెగ్మెంట్‌‌కు మరింత బూస్టప్‌‌గా నిలిచింది. అమెజాన్ డేటా సెంటర్‌‌‌‌ కూడా ఈ సెగ్మెంట్‌‌కు డిమాండ్‌‌ను పెంచుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా కొత్త ఇన్వెస్ట్‌‌మెంట్లకు ఆకర్షణీయంగా ఉంది’ – శాంసన్ ఆర్థర్,  హైదరాబాద్  బ్రాంచ్ డైరెక్టర్, నైట్ ఫ్రాంక్ ఇండియా ముంబై, పుణేలో సేల్స్ జంప్… ఫెస్టివ్ సీజన్‌‌లో ప్రమోషన్లు, వడ్డీ రేట్లు కనిష్టాలకు పడిపోవడం, కొన్ని మార్కెట్లలో ధరలు పడిపోవడం, కేంద్రం, ఆర్‌‌‌‌బీఐ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లిక్విడిటీ చర్యలు రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌ను కాపాడాయి. 2020 చివరి ఆరు నెలల కాలంలో సేల్స్ మళ్లీ పెరిగాయి. స్టాంప్ డ్యూటీ కోతతో మహారాష్ట్ర, పుణేలో అమ్మకాలు, లాంచ్‌‌లు పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ తెలిపింది. ‘హెచ్‌‌2 2020లో  కొన్ని సిటీల్లో సేల్స్ ప్రోత్సాహకరంగా ఉన్నాయి. క్యూ3 నుంచి రియల్ ఎస్టేట్ సెక్టార్ రివైవ్ అవుతుంది. క్యూ4లో హోమ్ సేల్స్ మరింత పెరిగాయి. హెచ్2 2020లో జరిగిన మొత్తం సేల్స్‌‌‌‌‌లో, ముంబై, పుణేవే 50 శాతం ఉన్నాయి. స్టాంప్ డ్యూటీ కోత పెడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగా సహకరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అనుసరించాలని కోరుతున్నాం’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా ఎండీ, ఛైర్మన్ శిశిర్ బైజాల్ అన్నారు. ఆఫీస్​ డీల్​సైజ్​ పెరిగింది… హైదరాబాద్ ఆఫీసు మార్కెట్‌‌ను తీసుకుంటే డీల్స్ సంఖ్య తగ్గినప్పటికీ.. డీల్ సైజు మాత్రం పెరిగినట్టు రిపోర్ట్ వెల్లడించింది. యావరేజ్ డీల్ సైజు చివరి ఆరు నెలల్లో 79,865 చదరపు అడుగుల నుంచి 97,554 చదరపు అడుగులకు పెరిగింది. క్యూ3తో పోలిస్తే క్యూ4లో ఆఫీసు ట్రాన్సాక్షన్స్ 640 శాతం పెరిగినట్టు వెల్లడించింది.. చివరి ఆరు నెలల డేటా తీసుకున్నా ట్రాన్సాక్షన్స్ 73 శాతం పెరిగాయి. కానీ కరోనా మహమ్మారి ఉండటంతో ఏడాది లెక్కనే ట్రాన్సాక్షన్స్ 2019తో పోలిస్తే సగానికి పైగా తగ్గినట్టు తేలింది. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు పాజిటివ్‌‌గా ఉండటంతో ఆఫీసు మార్కెట్‌‌ కోలుకుంది. కరోనాతో క్యూ2, క్యూ3లో సప్లయి పరంగా సవాళ్లున్నప్పటికీ హైదరాబాద్ ఆఫీసు మార్కెట్ రెండో అతిపెద్ద మార్కెట్‌‌గా నిలిచింది. 2020లో 8 లక్షల చదరపు అడుగుల కొత్త ఆఫీసు స్పేస్‌‌ మార్కెట్‌‌లోకి వచ్చింది. ఒక వైపు కరోనాతో అన్ని మార్కెట్లలో రెంట్లు తగ్గుతుంటే.. మన హైదరాబాద్‌‌లో మాత్రం స్థిరంగా ఆఫీసు కిరాయిలు పెరిగాయి. For More News.. సాగర్‌లో పోటీ చేసేది నేనే.. నా కొడుకు కాదు పీసీసీ చీఫ్​ ప్రకటనపై సాగర్‌‌ బై ఎలక్షన్​ దాకా ఆగుదం నిలోఫర్‌‌‌‌లో మందుల్లేవ్.. చిన్నారులకు ట్రీట్​మెంట్ లేదు