ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి చేసిన కేంద్రం

ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి చేసిన కేంద్రం
దేశంలో అమ్మే అన్ని కార్లకు ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం కొత్త ముసాయిదా నోటిఫికేషన్ ని విడుదల చేసింది. భద్రతా పరికరాల జాబితాలో.. ముందు ప్రయాణీకుల సేఫ్టీ కోసం బడ్జెట్ కార్లలోనూ,  ఫ్రంట్ సీట్ ఎయిర్ బ్యాగ్స్ కంపల్సిరీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి తయారయ్యే వివిధ కంపెనీలకు చెందిన అన్ని మోడల్స్ కార్లకు ఇది వర్తించనుంది.  ప్రయాణీకుల సీటుకు ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్ ని టెక్నికల్ కమిటీ అప్రూవ్ చేసింది. డ్రైవర్ సీటు ఎయిర్ బ్యాగ్ తో పాటు… ఫ్రంట్ సీట్ ఎయిర్ బ్యాగ్ ని తప్పనిసరి చేయనున్నారు. ప్రయాణీకుల సేఫ్టి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోడ్డు రవాణా శాఖ ప్రకటించింది. దీంతో పాటు స్పీడ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్ లాంటి అన్ని సేఫ్టీలను బడ్జెట్ కార్లలోకి తీసుకురానుంది. ప్రస్తుతం లాంచ్ అవుతున్న అన్ని ప్రీమియం కార్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు ఉన్నా… బడ్జెట్ మోడల్ కార్లలో మాత్రం లేవు. మారుతి సుజికి ఆల్టో, ఎక్స్ ప్రెస్సో, సెలెరియో, వాగన్ ఆర్ లాంటి వేరియంట్ లలో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక రెనాల్ట్ క్విడ్, డాట్సన్ రెడీ గో,  హ్యుందాయ్ సాంట్రో, మహేంద్ర బొలెరో లాంటి వాటిలో కూడా డ్రైవర్ సైడ్ మాత్రమే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.  అన్ని కార్లలో  ఫ్రంట్ సైడ్ ఎయిర్ బ్యాగ్ లను చేరుస్తుండటంతో..  ధరలు కూడా కొద్దిగా పెంచే అవకాశాలున్నాయంటున్నారు ఆటోమోటీవ్ ఇండస్ట్రీ ప్రతినిధులు. ప్రతీ ఏటా 2 నుంచి 3 శాతం ధరలు పెరుగుతుంటాయనీ… ఈసారి ఏయిర్ బ్యాగ్ వల్ల మరో 5 నుంచి 8 వేల రూపాయలు ఎక్కువ పెరిగే అవకాశాలన్నాయంటున్నారు. ఫ్రంట్ సీట్ సైడ్ ఏయిర్ బ్యాగ్ లేని కార్లలోనూ.. వచ్చే ఏడాది జులైలోపు ఎయిర్ బ్యాగ్ పెట్టుకోవాలని సూచించింది కేంద్రం.