ఆమె పంచాయితీ ఆఫీస్ లో పార్ట్ టైమ్ స్వీపర్. ఆఫీస్ లో అధికారులకు టీ చేసి అందించే వారు. 2017నుంచి స్వీపర్ గా నెలకు రూ.2వేలు సంపాదిస్తున్న ఆమె ఇప్పుడు పంచాయితీ ఆఫీస్ అధికారుల్ని ప్రశ్నించే స్థాయికి చేరింది. అదెలా సాధ్యమైందని ప్రశ్నించే వారికి ఆమె గెలుపే ఓ జవాబులా మారింది. కేరళ కొల్లాంలో ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో సీపీఎం పార్టీ తరుపున స్వీపర్ ఆనందవల్లీ ఎన్నికల బరిలో విజయం సాధించారు. స్వీపర్ గా ఉన్న ఆమె నాయకురాలి పాత్రపోషించడం పై ఆనందం వ్యక్తం చేస్తుంది.
గతంలో నేను స్వీపర్ గా పని చేశా. స్వీపర్ నుంచి గ్రామ అభివృద్ధికి కీలకమైన పోస్ట్ లో సేవ చేయడాన్ని నమ్మకలేకపోతున్న. నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రెసిండెంట్ గా విజయం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వారం ఇదే ఆఫీస్ లో నేను అధికారులకు టీ తయారు చేసి అందించా. ఇప్పుడు అదే అధికారుల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రతీ ఒక్కరికి సేవ చేయాలి. కనీస అవసరాల్ని తీర్చాలి. నేను టీ అందించిన అధికారులతో కలిసి ప్రాజెక్ట్ మీటింగ్ లకు అటెండ్ అవుతున్నాను. గ్రామాభివృద్ధిలో నాకు తోచిన సలహాలు ఇస్తున్నానంటూ విజయగర్వంతో చెబుతున్నారు ఆనందవల్లి .
