ఒక్క ఫోన్ కాల్ తో.. 243కి.మీ దూరంలో ఉన్న 3ఏళ్ల పాపను కాపాడిన రైల్వే పోలీసులు

ఒక్క ఫోన్ కాల్ తో.. 243కి.మీ దూరంలో ఉన్న 3ఏళ్ల పాపను కాపాడిన రైల్వే పోలీసులు

పోలీసుల సమయస్ఫూర్తి, లోకో పైలెట్ సాహసం ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడింది. మధ్యప్రదేశ్ లలిత్ పూర్ రైల్వేస్టేషన్ లో ఓ దుండగుడు మూడేళ్ల పాపను కిడ్నాప్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి రప్తిసాగర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కడు. అయితే పాప కిడ్నాప్ అయ్యిందంటూ తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు రైల్వేస్టేషన్ లో ఉన్న సీసీ టీవీ పుటేజ్ చెక్ చేశారు. కిడ్నాపర్ పాపతో రప్తిసాగర్ ఎక్స్ ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. వెంటనే రప్తిసాగర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లోక్ ఫైలెట్ కు ఫోన్ చేసి జరిగిన కిడ్నాప్ విషయం చెప్పారు. పాపను కాపాడేందుకు ట్రైన్ ను ఎక్కడా ఆపకుండా చూడాలని కోరారు. దీంతో లోకో పైలెట్ ట్రైన్ ను ఎక్కడా ఆపకుండా 243కిలో మీటర్ల దూరంలో ఉన్న భోపాల్ స్టేషన్‌ లో ఆపాడు.

ఈ వ్యవధిలో లలిత్ పూర్ రైల్వే స్టేషన్ పోలీసులు భూపాల్ రైల్వేస్టేషన్  పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ట్రైన్ వచ్చిన వెంటనే నిందితుణ్ని అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ట్రైన్ మరికొద్ది సేపట్లో వస్తుందనగా భూపాల్ రైల్వే పోలీసులు స్టేషన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భూపాల్ రైల్వే స్టేషన్ లో లోక్ పైలెట్ రప్తిసాగర్ ట్రైన్ నిలిపివేశాడు. దీంతో అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించేందుకే ఏర్పాట్లు చేశారు.

పోలీసులు సకాలంలో స్పందించి, సమన్వయంతో వ్యవహరించడం వల్లే పాపను కాపాడగలిగారు. రైలు ఏ కారణంగానూ మధ్యలో ఎక్కడా ఆగకుండా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు తగిన సిగ్నల్స్ ఇచ్చి ముందుకు సాగేలా చూశారు. దేశంలో ఇలాంటిది ఇదే తొలి ఘటన అని రైల్వే అధికారులు చెబుతున్నారు.