మోడీ ప్రమాణ స్వీకారానికి బాంగ్లాదేశ్, శ్రీలంక ప్రధానులు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ కొట్టింది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.మోడీ జూన్ 9న ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోడీ ప్రమాణ స్వీకార సభకు బాంగ్లాదేశ్, శ్రీలంక దేశాల ప్రధానులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు నేపాల్, భూటాన్, మారిషస్ కు నుండి పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం.

మోడీ శ్రీలంక ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘేకు, బాంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్ చేసి ఆహ్వానించినట్లు సమాచారం. వీరితో పాటు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్ లను కూడా మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. గురువారం వీరికి ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం.