జమ్మూలో వర్షాల తీవ్రత తగ్గింది. దీంతో అమర్ నాథ్ యాత్రకు పర్మిషన్ ఇచ్చారు అధికారులు. శ్రీనగర్ లో బేస్ క్యాంప్ లో ఉన్న యాత్రికులు మంచు లింగం దర్శనానికి బయల్దేరారు.
ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర ఈ నెల 1న ప్రారంభమైంది. అయితే వర్షాలు, వరదలు, వాతావరణం అనుకూలించక పోవడంతో యాత్రకు ఆటంకం కలుగుతోంది. అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ యాత్రికులను అమర్ నాథ్ యాత్రకు అనుమతిస్తున్నారు.
యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 6 రోజుల పాటే భక్తుల దర్శనాలు జరిగాయి. ఇప్పటి వరకు దాదాపు 67, 566 మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు చెప్పారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. రక్షణ దళ సిబ్బంది కొండ చరియలు ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
