యూట్యూబ్‌లో ఇండియన్ క్రియేటర్ల కోసం ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్ తెచ్చింది. నిజానికి గత ఏడాదిలోనే ఈ ఫ్రీ యూట్యూబ్ క్రియేట్ యాప్‌ని అనౌన్స్ చేసింది. దాన్ని ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా యూజర్లు ఈజీగా షార్ట్స్ చేసుకోవచ్చు. లేదంటే లాంగ్ఫామ్ కంటెంట్ రెండింటికీ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ క్రియేటివిటీకి మరింత పదును పెట్టేందుకు స్టోరీ బేస్డ్ వీడియోలను కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ యాప్ ఇప్పుడు భారత్ సహా 13 దేశాల్లో అందుబాటులో ఉంది. అందులో ప్రధానంగా ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో బీటా మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఇప్పటివరకు ఉన్న యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అనేది కొంచెం కష్టంగానే ఉంది. టైం ఎక్కువ తీసుకుంటుంది. ఛార్జ్ కూడా ఎక్కువే. ఈ ప్రాబ్లమ్‌కి ఇప్పుడు సొల్యూషన్ దొరికింది. ఎడిటింగ్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా డెవలప్ చేశారు. ఈ కొత్త యాప్ స్టార్ట్ చేశాక గత కొన్ని నెలల్లోనే గ్లోబల్ క్రియేటర్ కమ్యూనిటీ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అవసరమైన ఫీచర్లను కూడా చేర్చింది.
అదిరిపోయే ఫీచర్లు!
- యూట్యూబ్ క్రియేట్ యాప్‌లో ఫుటేజీని క్యాప్చర్ చేయాలి.
- సౌండ్ ట్రాక్ కోసం యాప్‌లో వేలల్లో పాటలు ఉన్నాయి. వాటిలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.
- మూడ్‌ని సెట్ చేసేలా విజువల్స్‌కు తగినట్టుగా ఉండే పాట సెలక్ట్ చేసుకోవచ్చు.
- యూట్యూబ్ క్రియేట్ మ్యూజిక్ లైబ్రరీలో రాయల్టీ ఫ్రీగా ఉంటాయి. కాబట్టి కాపీరైట్ గురించి పడుతుందన్న ఇబ్బంది లేదు.
- వీడియోలో మ్యూజిక్‌తో సింక్ అయ్యే బీట్ మ్యాచింగ్ ఫీచర్ వాడాలి. టైమ్‌లైన్‌లో గుర్తించడానికి ‘ఫైండ్ బీట్స్’ అనే ఆప్షన్ ట్యాప్ చేయాలి.
- వీడియో క్వాలిటీ కోసం స్టిక్కర్లు, జిఫ్, ఎఫెక్ట్, ఫిల్టర్స్ లైబ్రరీని వాడాలి.
- వీడియో ఫుటేజ్‌లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తీసేసేందుకు ఆడియో క్లీనప్ టూల్ వాడాలి. ఈ టూల్ సాయంతో వాయిస్ క్లియర్‌గా ఉంటుంది.
- టూల్‌పై ఒకసారి ట్యాప్ చేస్తే వీడియో ప్లే అయ్యే టైంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే అనవసరమైన శబ్దాలను తీసేయొచ్చు.
- క్యాప్షన్లను ఎడిట్ చేసేందుకు వీలుగా ఆటో క్యాప్షనింగ్ ఫీచర్ కూడా ఉంది.
- టెక్స్ట్ ఫార్మాట్‌ను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసేందుకు వివిధ స్టయిలింగ్ ఆప్షన్లను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.
- వీడియో స్టోరీ గురించి వివరించేందుకు వాయిస్ ఓవర్ ఇవ్వొచ్చు. వీడియో ఎడిట్ చేశాక నేరుగా యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయొచ్చు.