నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్ 10 నుంచి 20 వరకూ అప్లికేషన్లు

నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్ 10 నుంచి 20 వరకూ అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులకు ఎంప్లాయ్​మెంట్​కల్పించే కోర్సుల్లో ఫ్రీ ట్రైనింగ్​ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌‌‌‌ ఎన్.బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్‌‌ ఆఫీస్, టాలీ, ఫ్యాషన్‌‌ డిజైనింగ్‌‌, బ్యుటీషియన్, కంప్యూటర్ హార్డ్‌‌వేర్, ఎయిర్‌‌‌‌లైన్ టికెట్ బుకింగ్, ఏసీ, రిఫ్రిజిరేషన్‌‌, సీసీటీవీ, ఎల్​ఈడీ బల్బుల రిపేరింగ్, సోలార్ ప్యానల్​ఇన్‌‌స్టాలేషన్‌‌, డీజిల్ మెకానిక్, ఎలక్ర్టీషియన్‌‌ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌‌లోని సెట్‌‌విన్ సెంటర్స్‌‌లో ట్రైనింగ్​ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్స్‌‌లో లేదా 6302427521, 040 24071178, 04029568300 ఫోన్​ నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ నెల 10 నుంచి 20 వరకూ ఆఫ్‌‌లైన్‌‌లో అప్లికేషన్లు తీసుకుంటామన్నారు. పదో తరగతి పాస్‌‌ లేదా ఫెయిల్ అయి ఉండి, 18 నుంచి 35 ఏండ్ల వయసున్న వారందరూ అర్హులన్నారు.