నీట్-2021 ప్రవేశ పరీక్షను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ఇండియా(ఏఈఎస్ఎల్) ప్రకటించింది. ఈనెల 22, 29 మరియు సెప్టెంబర్ 05వ తేదీలలో ‘ఆల్ ఇండియా నీట్ మాక్ టెస్ట్ ఫర్ 2021’ ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నట్ల ప్రకటించింది.టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్ లో నేషనల్ లీడర్, డిజిటల్ లెర్నింగ్ లో లీడర్ బైజుస్ తో (BYJU’S) కలిసి ఇండియా లో అతి పెద్ద ఆల్-ఇండియా NEET మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నామని వివరించింది.
ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ చౌదరి మాట్లాడుతూ ప్రతి పేపరు నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించడం జరిగిందని, మాక్ టెస్టు ఫలితాలు, ఇచ్చే ర్యాంకులు విద్యార్థులు తమ బలహీనతలు, ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నామో గుర్తించి, మెరుగు పడేందుకు ఆకాష్ టీమ్ ఒక వివరణాత్మక రిపోర్ట్ అందిస్తుందన్నారు. కాన్సెప్ట్ మరియు థీరీల గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగించే విధంగా, ఈ టెస్ట్ పేపర్ల గురించి ఒక లోతైన వీడియో సొల్యుషన్ అందించ బడుతుందని తెలిపారు. ఈ మాక్ టెస్ట్ కు రిజిస్టర్ చేసుకోవాలని కోరుకునే NEET పరీక్షార్థులు, క్రింది లింక్ పై క్లిక్ చేసి చేయాలి.
https://aakashdigital.com/mock/neet-test
