సత్యసాయి మందిరంలో కంటి వైద్య శిబిరం

జోగిపేట, వెలుగు: సత్యసాయి మందిరంలో శంకర కంటి ఆస్పత్రి వారి సౌజన్యంతో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మొత్తం 62 మందికి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. ఇందులో ఆపరేషన్​అవసరమైన 25 మందికి గుర్తించారు. 

వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు అన్నదానం చేశారు. శంకర కంటి ఆస్పత్రి వైద్యులు, సత్యసాయి సేవాదళ్​సభ్యులు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.