ఇవాళ నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం

అమ్రాబాద్, వెలుగు: నేటి నుంచి ఈ నెల 15 వరకు మాచారం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన అనూష ప్రాజెక్ట్  అధినేత అండవల్లి జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో సంకార నేత్రాలయ సహకారంతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏర్పాట్లను ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్​రెడ్డితో కలిసి పరిశీలించారు. కంటి వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా ఆపరేషన్, కంటి అద్దాలు అందిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.