ఇలా చేస్తే చాలు : బతికున్నంత కాలం ఫ్రీగా బర్గర్లు, కూల్ డ్రింక్స్..

ఇలా చేస్తే చాలు :  బతికున్నంత కాలం ఫ్రీగా బర్గర్లు, కూల్ డ్రింక్స్..

ఆహారం విషయంలో ప్రతి ఒక్కరికీ ఒక్కో స్వంత ప్రాధాన్యతలుంటాయి. కొందరికి ఇంటి ఆహారాన్ని ఇష్టపడితే.. మరికొందరికి బయటి ఆహారం ఇష్టపడతారు. కొంతమందికి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం.. మరికొంత మంది ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టపడతారు. బర్గర్లు, శీతల పానీయాలు, శాండ్‌విచ్‌లను ఇష్టపడే వారిలో మీరు కూడా ఒకరైతే, అటువంటి వారి కోసమే ఈ అద్భుతమైన ఆఫర్. మీరు దీనికి సంబంధించిన షరతును నెరవేర్చగలిగితే, మీరు మీ జీవితాంతం శాండ్‌విచ్‌లు, శీతల పానీయాల కోసం చెల్లించాల్సిన అవసరం లేదు.

అమెరికన్ అతిపెద్ద శాండ్‌విచ్ చైన్ సబ్‌వే ఈ సరికొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఫ్రాంచైజీ సబ్‌వే ఒక గొప్ప ఆఫర్‌ను అందించింది. షరతలతో కూడిన ఈ ఆఫర్ లో.. కస్టమర్‌ జీవితాంతం ఉచిత ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. అంతకంటే ముందు అసలు ఈ ఆఫర్ పొందాలంటే ఉన్న కండిషన్లు ఏంటీ అన్న విషయం ఒక్క సారి గమనించాలి. ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆఫర్ ఆగస్టు 4 రాత్రి వరకు చెల్లుబాటు అవుతుందని కూడా నిర్వాహకులు ప్రకటించారు.

ఇక ఆఫర్ కండిషన్ విషయానికొస్తే.. కంపెనీ ఒక పోటీని ఏర్పాటు చేసింది. అందులో పోటీదారులు తమ పేరును చట్టబద్ధంగా 'సబ్‌వే'గా మార్చుకోవాలి. ఈ పోటీలో పాల్గొనడానికి, కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:00 గంటల నుంచి ఆగస్టు 4వ తేదీ రాత్రి 11:59 గంటల మధ్య SubwayNameChange.comలో సైన్ అప్ చేయాలి. అధికారిక నిబంధనల ప్రకారం అందిన అన్ని అర్హత గల ఎంట్రీల నుంచి 7 ఆగస్టు 2023న లేదా ఆ తర్వాత రాండమ్ డ్రా ద్వారా విజేత ఎంపిక చేయబడతారు. ఈ విజేతకు 50 వేల US డాలర్ల కంటే ఎక్కువ విలువైన బహుమతి కార్డ్‌లు లభిస్తాయి. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దీని విలువ రూ.41 లక్షల 13 వేలు. దీని చెల్లుబాటు జీవితకాలం ఉంటుంది.

ఎలా పాల్గొనాలి?

ఈ పోటీలో పాల్గొనే పోటీదారుడి వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. పేరు మార్చినందుకు విజేతకు కంపెనీ చట్టపరమైన రుసుము 750 డాలర్లు చెల్లిస్తుంది. తన పేరు మార్చుకోవడానికి ఇష్టపడే పోటీదారుడు తన పేరు మార్పు ధృవీకరణ పత్రాన్ని 4 నెలల్లోపు కంపెనీకి చూపించవలసి ఉంటుంది. దరఖాస్తుదారు పూర్తి పేరు-చిరునామా, మెయిల్, పుట్టిన తేదీని ఎంట్రీ ఫారమ్‌లో రాయవలసి ఉంటుంది. ఇందులో, అతను పేరు మార్చడానికి తన సమ్మతిని కూడా ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడే అతని ఫారమ్ సమర్పించబడుతుంది.