ఆర్మీలో పనిచేస్తానంటూ నమ్మించి మోసం

  • అగ్గువకే కారు అమ్ముతానంటూ రూ. లక్ష చీటింగ్​

ఇబ్రహీంపట్నం, వెలుగు:  ఆర్మీలో పనిచేస్తానని,  ట్రాన్స్​ఫర్ అవ్వడంతో ఆల్టో కారును తక్కువ ధరకే అమ్ముతానంటూ  చీట్​ చేసిన ఘటన    మంచాల పీఎస్​  పరిధిలో జరిగింది.  సత్యం తండాకు చెందిన బాధితుడు లారీ డ్రైవర్​ నెనావత్ శ్రీను వివరాల ప్రకారం.. డిసెంబర్​ 14న ఫేస్​బుక్​లో ఆల్టో కారు రూ. 45వేలకే అమ్ముతున్నట్లు యాడ్​ కనిపించగా ఫోన్ చేస్తే తను ఆర్మీలో పనిచేస్తానని తన పేరు గోపాల క్రిష్ణగా పరిచయం చేసుకున్నాడు. 

హైదరాబాద్​ నుంచి జమ్మూకు ట్రాన్స్ఫర్​ అయిందని నమ్మించాడు. మొదట ఫోన్​ పేలో రూ.1400 ట్రాన్స్​ఫర్​ చేయించుకున్నాడు. మరుసటి రోజు వేర్వేరుగా రూ. 22500, రూ 22000 పంపిన తర్వాత మాయ మాటలు చెప్పి మళ్లీ మరో నంబర్​కు రూ. 61, 999 జీపే పంపించుకున్నాడు. కొద్ది రోజులకు తాను మోసపోయినట్లు గ్రహించి, మంచాల పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.