రెడ్​ జోన్​లో గద్వాలలోని నాలుగు గ్రామాలు

గద్వాల, వెలుగు: జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం వడ్డేపల్లి మండల కేంద్రంలో 45.6 డిగ్రీలు, ధరూర్  మండలకేంద్రంలో 45.3, ఇటిక్యాల మండలం సాతర్ల విలేజ్ లో 45.1 డిగ్రీలు, ధరూర్  మండలం ద్యాగదొడ్డిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఆ గ్రామాలను రెడ్ జోన్ గా గుర్తించారు. మిగిలిన గ్రామాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదైంది.