తిరుపతి వెళ్తున్నారా.. ఈ నాలుగు స్పెషల్ రైళ్లు మీకోసమే

తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం చాలా మంది భక్తులు ప్రయాణం చేస్తు్ంటారు.  ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.  సికింద్రాబాద్ నుంచి తిరుమల రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లుగా అధికారులు జనవరి 23వ తేదీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  2024 జనవరి 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు వీటిని ఉపయోగించుకోవాలని కోరారు.  

సికింద్రాబాద్-తిరుపతి (07041) రైలు జనవరి 25వ తేదీ గురువారం రోజున  సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి..  శుక్రవారం ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఇదే రైలు తిరుపతి-సికింద్రాబాద్ (07042) తిరుగు ప్రయాణంలో జనవరి 26వ తేదీ శుక్రవారం రాత్రి 07:50 గంటలకు బయలుదేరి.. శనివారం ఉదయం 09:30 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. 

ఇక  సికింద్రాబాద్-తిరుపతి (02764) రైలు జనవరి 27వ తేదీ శనివారం రోజు  సాయంత్రం 06:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి.. ఆదివారం ఉదయం 06:45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి - సికింద్రాబాద్ (02763) రైలు జనవరి 28వ తేదీన  ఆదివారం సాయంత్రం 05:15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 05:55 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.