అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని.. మహిళనుంచి రూ.1.36లక్షలు వసూలు

  • మహిళ వద్ద రూ. 1.36 లక్షలు తీసుకొని నకిలీ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తులు
  • ఆర్డర్‌‌‌‌‌‌‌‌ నిజమే అనుకొని జాయిన్ ‌‌‌‌‌‌‌‌చేసుకున్న హెచ్‌‌‌‌‌‌‌‌ఎం
  • 40 రోజుల తర్వాత జీతం అడగడంతో బయటపడ్డ మోసం

బెల్లంపల్లి రూరల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : అటెండర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగం ఇప్పిస్తామంటూ నలుగురు వ్యక్తులు ఓ మహిళ వద్ద డబ్బులు తీసుకొని ఫేక్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అపాయింట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెటర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఆ లెటర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మహిళను జాయిన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్న హెచ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం 40 రోజులు పనిచేయించుకున్నాడు. తీరా మహిళ జీతం అడగడంతో అసలు విషయం బయట పడింది. 

ఈ ఘటన ఆదిలాబాద్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా నెన్నెలలో సోమవారం వెలుగుచూసింది. నెన్నెల ఎస్సై ప్రసాద్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... నెన్నెలకు చెందిన బూడం స్వర్ణలతకు విద్యాంజలి పథకంలో అటెండర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ అదే గ్రామానికి చెందిన బాపు అనే వ్యక్తి నమ్మించాడు. ఖర్చులకు డబ్బులు ఇస్తే ఆర్డర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొని వస్తానని చెప్పారు. 

తర్వాత మందమర్రికి చెందిన శ్రీనివాస్, గోదావరిఖనికి చెందిన తిరుమల, పెద్దపల్లికి చెందిన పిడుగు రవీందర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఫేక్ అపాయింట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సృష్టించి స్వర్ణలతకు చూపించాడు. అది నిజమేనని నమ్మిన స్వర్ణలత తన బంగారాన్ని కుదువపెట్టి జులై 1న రూ.1.36 లక్షలు ఇచ్చింది. తర్వాత స్వర్ణలత అపాయింట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొని నెన్నెల జడ్పీ హైస్కూల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లగా ఆర్డర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిజమేనని నమ్మిన హెచ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం ప్రకాశ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహిళను డ్యూటీలో జాయిన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు.

40 రోజులు పనిచేసిన అనంతరం స్వర్ణలత హెచ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం వద్దకు వెళ్లి జీతం అడుగగా డీఈవో పర్మిషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదని, అక్కడి నుంచి పర్మిషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తేనే జీతం చెల్లించడం సాధ్యమవుతుందని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన స్వర్ణలత లెటర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన వ్యక్తులకు వద్దకు వెళ్లి నిలదీయడంతో వారు రూ.1.36 లక్షల చెక్కు రాసి ఇచ్చారు.

 ఆ చెక్కును బ్యాంకుకు తీసుకెళ్తే బౌన్స్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. దీంతో మోసపోయానని గ్రహించిన స్వర్ణలత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెచ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం ప్రకాశ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు బాపు, శ్రీనివాస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిరుమల, రవీందర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.