హైదరాబాద్, వెలుగు: భూ భారతి ఆర్ఓఆర్ –2024 బిల్లు రూపకల్పనలో నలుగురు కీలకంగా వ్యవహరించారు. ఇందులో రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, భూమి సునీల్, సీసీఏల్ఏలో అసిస్టెంట్ సెక్రటరీ లచ్చిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్ ఉన్నారు. దాదాపు 9 నెలల నుంచి అనేక భూ చట్టాలను, క్షేత్రస్థాయిలో సమస్యలను అధ్యయనం చేసి, అన్ని జిల్లాల ప్రజలు, రెవిన్యూ నిపుణుల నుంచి సలహాలు తీసుకుని సులువుగా భూ సమస్యలకు పరిష్కారం చూపించేలా బిల్లును తయారు చేశారు. దాదాపు 23 సార్లు డ్రాప్ట్లో చేంజేస్ చేసి.. చివరకు 2024 సంవత్సరం ప్రకారం 24వ డ్రాప్ట్ను ఓకే చేశారు.