గుజరాత్‌‌‌‌లో నాలుగు కొత్త కరోనా కేసులు

గుజరాత్‌‌‌‌లో నాలుగు కొత్త కరోనా కేసులు
యూకే నుంచి వచ్చిన 15 మందికి పాజిటివ్‌‌‌‌ అహ్మదాబాద్‌‌‌‌: దేశంలో యూకే స్ట్రెయిన్‌‌‌‌ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. యూకే నుంచి గుజరాత్‌‌‌‌ వచ్చిన నలుగురికి కొత్త కరోనా సోకినట్లు అధికారులు శనివారం తెలిపారు. యూకే నుంచి వచ్చిన వారిలో 15 మందికి కరోనా పాజిటివ్‌‌‌‌ రావడంతో వారి శాంపుల్స్‌‌‌‌ను పుణెలోని నేషనల్‌‌‌‌ ఇనిస్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ వైరాలజీ (ఎన్‌‌‌‌ఐవీ)కి పంపామని, వారిలో నలుగురికి కొత్త కరోనా ఉన్నట్లు రిపోర్ట్‌‌‌‌ వచ్చిందని హెల్త్‌‌‌‌ సెక్రటరీ జయంతి రవి చెప్పారు. ఆ నలుగురిని అహ్మదాబాద్‌‌‌‌లోని హాస్పిటల్‌‌‌‌లో ఉంచి ట్రీట్మెంట్‌‌‌‌ అందిస్తున్నామని వివరించారు.