పాలమూరు జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్లు

నారాయణపేట, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం నలుగురు కొత్త కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. నారాయణపేట  కలెక్టర్ గా సిక్తా  పట్నాయక్ కలెక్టరేట్​లోని తన ఛాంబర్​లో బాధ్యతలు తీసుకున్నారు. కొత్త కలెక్టర్ కు అడిషనల్​ కలెక్టర్  అశోక్ కుమార్, కలెక్టరేట్  ఏవో నర్సింగరావు, డీపీఆర్వో ఎంఏ రశీద్, కలెక్టరేట్  సూపరింటెండెంట్​లు, సిబ్బంది, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ లోని వివిధ విభాగాలను కలెక్టర్  సిక్తా పట్నాయక్  పరిశీలించారు.  

మహబూబ్ నగర్ కలెక్టరేట్: మహబూబ్ నగర్  కొత్త కలెక్టర్ గా విజయేందిర బోయి బాధ్యతలు స్వీకరించారు. ఆర్అండ్ బీ గెస్ట్​ హౌస్​ వద్ద పోలీస్  గౌరవ వందనం స్వీకరించారు. అడిషనల్  కలెక్టర్  మోహన్ రావు, అడిషనల్​ ఎస్పీ పి రాములు, ఆర్డీవో నవీన్ కలెక్టర్ కు స్వాగతం పలికారు. డీఎంహెచ్​వో కృష్ణ, డీపీఆర్వో శ్రీనివాస్, ఎస్సీ డెవలప్​మెంట్​ ఆఫీసర్​ పాండు, లీడ్  బ్యాంక్  మేనేజర్ భాస్కర్, కలెక్టరేట్  ఏవో శంకర్,  రెడ్ క్రాస్  సొసైటీ చైర్మెన్  నటరాజ్, వివిద శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది కలెక్టర్​కు బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

 కలెక్టర్ ను మహబూబ్ నగర్  ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, కాంగ్రెస్  నాయకుడు బుద్దారం సుధాకర్ రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి స్వాగతం పలికారు. అనంతరం టెలీ కాన్ఫరెన్స్  ద్వారా ధరణి పెండింగ్  దరఖాస్తులపై తహసీల్దార్లతో కలెక్టర్​ రివ్యూ నిర్వహించారు. ధరణి పెండింగ్  దరఖాస్తులను వెంటనే క్లియర్  చేయాలని ఆదేశించారు. ప్రతి ధరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్  లేకుండా చూడాలన్నారు. బక్రీద్  పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

వనపర్తి: వనపర్తి కలెక్టర్​గా ఆదర్శ్  సురభి బాధ్యతలు స్వీకరించారు. అడిషనల్​ కలెక్టర్  నగేశ్​ కలెక్టర్ కు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ జిల్లాలో ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కలెక్టర్ ను ప్లానింగ్​ బోర్డు వైస్​ చైర్మన్​ చిన్నారెడ్డి కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 

జిల్లా అభివృద్ధికి  సమన్వయంతో కృషి చేద్దామని, తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్  సిబ్బంది కొత్త కలెక్టర్​ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా మార్కెటింగ్  ఆఫీసర్​ స్వరణ్ సింగ్, డీఈవో  గోవిందరాజు, యూత్  అండ్  స్ట్పోర్ట్స్ ఆఫీసర్​ సుధీర్ రెడ్డి, సీపీవో చంద్రశేఖర్ రాజు, డీపీఆర్​వో  సీతారాం, సి సెక్షన్  సూపరింటెండెంట్  రమేశ్ రెడ్డి, డీటీ మధు ఉన్నారు. 

 నాగర్ కర్నూల్ టౌన్: నాగర్ కర్నూల్  కలెక్టర్ గా బదావత్  సంతోష్  బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్  ఏవో  చంద్రశేఖర్, వెల్దండ తహసీల్దార్ రవికుమార్, కలెక్టర్  సీసీ గౌతమ్  బొకే అందజేసి స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం బదిలీపై వెళ్తున్న కలెక్టర్​ ఉదయ్​కుమార్​ను క్యాంప్​ ఆఫీస్​లో మర్యాదపూర్వకంగా కలిశారు.