కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లారీ టైర్ పంక్చర్ అవగా మరమ్మతుల చేస్తున్న టైమ్ లో అదే సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు నలుగురి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సును ఆపకుండా డ్రైవర్ రాజమహేంద్రవరం వైపు తీసుకెళ్లాడు.
సమాచారం అందుకున్న పోలీసులు బస్సును వెంబండించి పట్టుకున్నారు. మృతులను నక్కబొక్కలపాడుకు చెందిన లారీ డ్రైవర్లు దాసరి కిషోర్, దాసరి సురేశ్, బండి నాగయ్య, దిమ్మిలి రాజుగా గుర్తించారు. వారి మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. . ఆర్టీసీ బస్సు అదుపుతప్పడం వల్ల ప్రమాదం జరిగిందా లేదా డ్రైవర్ నిద్ర మత్తు ఈ ఘటనకు కారణమా అనే దానిపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.