తమిళనాడు రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

తమిళనాడు రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిల్లు వర్కర్లతో వస్తున్న వ్యాన్‌, ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 60మందికి పైగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. మృతుల్లో వ్యాన్‌ డ్రైవర్‌ కూడా ఉన్నట్టు తెలిపారు. దిండిగల్‌ జిల్లాలోని వతలగుండు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.