గురుకుల జాబ్స్ నోటిఫికేషన్ లో..ఒక్కడికే నాలుగు జాబ్స్

అమ్రాబాద్, వెలుగు : నల్లమల యువకులు ఒకే నోటిఫికేషన్ లో నాలుగు, మూడు జాబ్స్​ కొట్టి శభాష్​ అనిపించుకుంటున్నారు. గురుకుల జాబ్స్  నోటిఫికేషన్ లో మన్ననూర్  గ్రామానికి చెందిన దాసరి అక్షయ్ కుమార్  ఇంగ్లిష్, టీజీటీ, జూ.లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు సెలక్ట్ అయ్యాడు.

అలాగే పదర మండలకేంద్రానికి చెందిన గొల్లం సురేశ్​ ఫిజిక్స్, టీజీటీ, జూ.లెక్చరర్  ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. నల్లమల ఏజెన్సీ గ్రామంలోని పేద కుటుంబంలో పుట్టిన వీరిద్దరు ఎటువంటి కోచింగ్  లేకుండా చదువుకొని ఉద్యోగాలు సాధించడంతో పేరెంట్స్ తో పాటు గ్రామస్తులు అభినందిస్తున్నారు.