క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చే వార్త. గురువారం (అక్టోబర్ 24) ఒక్క రోజే నాలుగు అంతర్జాతీయ మ్యాచ్ లు ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో మూడు టెస్ట్ మ్యాచ్ లు కాగా.. మరొకటి వన్డే మ్యాచ్. ప్రస్తుతం మూడు టెస్ట్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. వీటిలో ఒకటి న్యూజిలాండ్, భారత్ మధ్య పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్. ఈ సిరీస్ విషయానికి వస్తే మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
బంగ్లాదేశ్ తో సౌతాఫ్రికా తొలి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా నాలుగో రోజు ఆట కొనసాగుతుంది. 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ప్రస్తుతం వికెట్ నష్టపోకుండా 36 చేసింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 106 ఆలౌటైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 308 పరుగులు చేసి 202 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 306 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య చివరిదైన మూడో టెస్టు రావల్పిండి వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుంది. మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1 తో నిలిచాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ గెలుచుకుంటుంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం అహ్మదాబాద్ వేదికగా భారతమహిళల జట్టు న్యూజిలాండ్ మహిళా జట్టుతో తొలి వన్డే మ్యాచ్ లో తలపడనుంది.
CRICKET FEAST TODAY! ?4 thrilling matches to savor ? pic.twitter.com/mq4xoU4pa0
— CricketGully (@thecricketgully) October 24, 2024