నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్.. సిద్ధం సభలో జగన్

మేదరమెట్లలో ఉప్పెనలా వచ్చిన జనసమూహం కనిపిస్తుందని సీఎం జగన్ అన్నారు.మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందన్నారు. ఓటు అనే అస్త్రం ప్రయోగించాల్సిన సమయం వచ్చిందన్నారు.  మరో  ఐదేళ్లు ఈ ప్రయాణం కొసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ జనసమూహానికి జగన్ సెల్యూట్ చేశారు.పేదవాడి భవిష్యత్తుకు మీరంతా సిద్ధమేనా అని జగన్ ప్రశ్నించారు.

పార్టీల పొత్తుతో చంద్రబాబు.. ప్రజలే బలంగా మనం తలపడుతున్నామని జగన్ అన్నారు. వచ్చే ఎన్నికలు విశ్వసనీయతకు.. వంచనకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.  సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం .. జగన్ ను ఓడించాలని వారు చూస్తున్నారు... పేదలను గెలిపించాలని నేను చూస్తున్నానని సీఎం జగన్ మేదరమెట్ల సిద్ధం సభలో అన్నారు.

ALSO READ :- ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే డయాబెటిస్‭కు చెక్

ఈ యుద్దంలో అర్జునిడి పాత్ర నాది... కృష్ణుడి పాత్ర మీది .. నాకు నటించే పొలిటికల్ స్టార్స్ లేరు.. నాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని సీఎం జగన్ అన్నారు.