
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో దారుణం చోటుచేసుంది. నైగావ్ ఈస్ట్‌లో ఉన్న నవ్‌కర్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 12 వ అంతస్తు నుంచి పడి నాలుగేళ్ల బాలిక చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజలి, ప్రజాపతి దంపతులు నవ్‌కర్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 12 వ అంతస్తులోని ఫ్లాట్ లో నివసిస్తున్నారు. వారికి అన్విక అనే నాలుగేండ్ల కూతురు ఉంది.
బుధవారం సాయంత్రం అంజలి తన కూతురుతో కలిసి షాపింగ్ కు బయలుదేరింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చాక అంజలి ఫ్లాటుకు తాళం వేస్తుండగా అన్విక అటూఇటూ తిరిగింది. దీంతో అన్వికను పక్కనే ఉన్న షూ రాక్ పై కూర్చోబెట్టి అంజలి షూ వేసుకుంటోంది. ఇంతలోనే అన్విక షూ రాక్‌పై నుంచి కిటికీపైకి ఎక్కింది. గ్రిల్స్ లేకపోవడంతో కింద పడిపోయింది. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే పాప చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నైగావ్ పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.