జోగిపేట,వెలుగు : జోగిపేట మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో రూ. కోటి నిధులతో నిర్మించబోతున్న సీసీ రోడ్డు పనులకు వార్డ్ కౌన్సిలర్ డాకురి శివ శంకర్, మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్యతో కలిసి బుధవారం భూమి పూజ చేశారు. ఎస్ఆర్ఎం కాలేజీ నుంచి, రిక్షా కాలనీ కోర్టు రోడ్డు మార్గంలో ఈ నూతన సిసి రోడ్డు పనులు చేపట్టనున్నట్లు కమిషనర్ తిరుపతి తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేందర్ గౌడ్
మాజీ ఎంపీటీసీ సభ్యులు డాకూరి వెంకటేశం, ఏఈ శ్రీకాంత్, జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొషిక శేఖర్, సందీప్ గౌడ్, ప్రదీప్ గౌడ్, దిలీప్ గౌడ్, ఆల్లె యాదగిరి, అంతం శీను, గుర్రం కృష్ణ , అబ్బా ఆలి, అరిగే రామన్న, డాకూరి నాగరాజు,నందు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.