ఫార్ములా ఈరేస్ కేసు.. ACB ఎదుట IAS అరవింద్ కుమార్

ఫార్ములా ఇ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బుధవారం(జనవరి 8, 2025) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎదుట హాజరయ్యారు. బీఆర్‌ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మాజీ మంత్రి కేటీఆర్, రిటైర్డ్ హెచ్‌ఎండీఏ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డితో పాటు అరవింద్‌కుమార్‌ను నిందితుడిగా చేర్చారు.

HMDA ఒప్పందం వెనుక అప్పటి మంత్రి KTR పాత్రపై అరవింద్ కుమార్ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లిందంటూ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు  చేసిన విషయం తెలిసిందే.

Also Read :- పరిగి బస్టాండ్లో పట్టపగలే చైన్ స్నాచింగ్

 ఫైనాన్స్ డిపార్టుమెంట్ అనుమతి లేకుండా రూ.54 కోట్లు నగదు రెండు దఫాలుగా విదేశీ కంపెనీకి చెల్లించాల్సిందిగా HMDAను నాటి మంత్రి కేటీఆర్ ఆదేశించారనేది ఆరోపణ.

  దురుద్దేశంతో నిధులు బదిలీ చేయమని ఆదేశించారా? తన లబ్ది కోసం చెల్లించమన్నారా?  మూడో పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారా?  HMDA నిధుల దుర్వినియోగం, అనుమతి లేకుండా నిధులు బదిలీ జరిగాయా? లేదా? అనేది విచారణలో తేలనున్నది.