యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్‌ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్‌ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోన్న ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ (89) ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా మారింది. ప్ర‌స్తుతం ఆయ‌నను వెంటిలేషన్‌పై ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. నిన్న(మంగళవారం)సాయంత్రం నుంచి ఆయ‌న‌ను లైఫ్‌ సేవింగ్ సపోర్ట్‌పై ఉంచామ‌ని ప్ర‌క‌టించారు. సీనియర్ డాక్టరల్ టీం ఆయన ఆరోగ్య ప‌రిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు. అయితే.. ఆయన ఆరోగ్య ప‌రిస్థితి స్థిరంగా లేద‌ని చెప్పారు.

క‌ల్యాణ్ సింగ్ ల‌క్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ఆస్పత్రిలో ఈ నెల 4వ తేదీ నుంచి చికిత్స తీసుకుంటున్నారు. క‌ల్యాణ్ సింగ్‌కు హృద్రోగ‌, న‌రాల డాక్టర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స అందిస్తున్నారు.