న్యూఢిల్లీ: కోల్ స్కామ్ కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రేకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. 1999లో జార్ఖండ్ కోల్ స్కామ్‌లో కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు దిలీప్ రేపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా దోషులతోపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాదనలను విన్న కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి సర్కార్‌లో దిలీప్ రే ఇంధన శాఖ మంత్రిగా పని చేశారు. దిలీప్ రేతోపాటు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఇద్దరు సీనియర్ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యనంద్ గౌతమ్, కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్) డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్‌కు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది.
