బీజేపీలోకి ఆగని వలసలు.. బెంగాల్‌‌లో కమలం జోరు

బీజేపీలోకి ఆగని వలసలు.. బెంగాల్‌‌లో కమలం జోరు

న్యూఢిల్లీ: వెస్ట్ బెంగాల్‌‌లో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. అధికార తృణమూల్ నుంచి ఒక్కొక్కరుగా ప్రముఖ నేతలు కమల తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా టీఎంసీ రాజ్యసభ ఎంపీ దినేశ్ త్రివేది బీజేపీలో చేరారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంద్రి పీయూష్ గోయల్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆధ్వర్యంలో త్రివేది బీజేపీలో జాయిన్ అయ్యారు. దీంతో ఆ పార్టీ వర్గాల్లో జోష్ మరింత పెరిగింది. బెంగాల్ ఎన్నికల్లో త్రివేది కీలక పాత్ర పోషిస్తారని నడ్డా చెప్పారు.