జడ్పీ హైస్కూల్​ పూర్వ విద్యార్థులు .. 50 ఏండ్లకు కలిసిన్రు

అచ్చంపేట, వెలుగు: పట్టణంలోని జడ్పీ హైస్కూల్​ పూర్వ విద్యార్థులు 50 ఏండ్ల తర్వాత బుధవారం కలుసుకున్నారు. స్కూల్​ ఆవరణలో కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కందూరు సుధాకర్,చంద్రకుమార్, విద్యాసాగర్, లక్ష్మణాచారి, బందగి, హరికుమారి, శ్యామల పాల్గొన్నారు.