ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గుండె పోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరు విజయలక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఐసియూలో చికిత్స పొందుతున్నారు. కోడెల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఉండటంతో గుంటూరు నుండి హైదరాబాద్ కు తరలించాలని సూచించారు డాక్టర్లు. అయితే కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ నిమ్స్ కు తరలించే యోచనలో ఉన్నారు.
