డిసెంబర్ 28న మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు

 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) అంత్యక్రియలు రేపు ( డిసెంబర్ 28న)  అధికారిక లాంఛనాలతో  జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు రోజులు సంతాప దినాలను నిర్వహించనుండగా తెలంగాణలో నేడు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వృద్ధాప్య సమస్యలతో గత కొన్నేళ్లుగా ఆయన బాధపడుతున్నారు.

 మన్మోహన్ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం ( డిసెంబర్ 26)  కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస వదిలినట్టు ఎయిమ్స్ వెల్లడించింది. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు పదేండ్లపాటు ప్రధానిగా సేవలందించారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే జరిగింది. 

మన్మోహన్ సింగ్ తన హయంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. శ్రద్ధ, పనిపై అతడి విద్యా విధానం, నిరాడంబరమైన జీవితంతో గుర్తింపు పొందారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో ఆర్బీఐ గవర్నర్ హోదాలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధిరేటు నమోదుకాగా.. పేదరికం తగ్గుముఖం పట్టింది.

సింగ్ భౌతికకాయం గురువారం అర్థరాత్రి ఎయిమ్స్ నుంచి  మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ప్రజలు అంతిమ నివాళులర్పించేందుకు ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు. డిసెంబర్ 28న జరగాల్సిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవంతో పాటు అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.

ఇవాళ  ( డిసెంబర్ఉ 27) దయం 11 గంట లకు కేంద్ర మంత్రి వర్గం సమావేశం జరగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సంతాపాన్ని తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప నాయ కుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.