మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్నిరేపు (శుక్రవారం) ప్రతిష్టించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వాజ్ పేయి జయంతి సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పింది. శౌర్య స్మారక సమీపంలో విగ్రహాన్నిఏర్పాటు చేయనున్న స్థలాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం పరిశీలించారు. గ్వాలియర్‌కు చెందిన ప్రముఖ శిల్పి ప్రభాత్ రాయ్ వాజ్ పేయి విగ్రహాన్ని తయారు చేసినట్లు భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు.
