మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్లో చేరిక

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురైయ్యారు. గురువారం(26 డిసెంబరు 2024) సాయంత్రం చికిత్సకోసం మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్‌ కు తరలిం చారు. ప్రస్తుతం ఆయనకు ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మాజీ ప్రధాని శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు ఆయన ఆఫీస్ వర్గాలు తెలిపాయి. 

మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. 2024 ప్రారంభంలో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు.33 సంవత్సరాల తర్వాత ఎగువ సభలో తన రాజకీయ ఇన్నింగ్స్‌ను ముగించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ప్రస్తుతం మన్మోహన్ సింగ్ వయస్సు 92 యేళ్లు.