రాజకీయాల్లో గెలుపోటములు సహజం..ఇవాళ ఒకరు గెలిస్తే..మరోసారి ఇంకొకరు..ఓడిన వారు స్పోర్టివ్ గా తీసుకోవాలి..అనే మాటలు మనం అప్పుడప్పుడు వింటుం టాం..ఈ మాటను అక్షరాల నిజం చేశారు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్. ఒడిషా అసెంబ్లీలో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన ఆసక్తి కరమైన సంఘటన గురించి ఇప్పుడు డిటెయిల్డ్ గా తెలుసుకుందాం..
ఒడిషా అసెంబ్లీలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో లక్ష్మణ్ బాగ్ తన సీటు నుంచి లేచి నిలబడి మాజీ సీఎం పట్నాయక్ కు అభివాదం చేస్తున్నట్లు కనిపిస్తుంది. పట్నాయక్ కూడా తిరిగి బాగ్ కు శుభాకాంక్షలు తెలిపారు..దీంతో పాటు ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు..ఓహ్ మీరేనా నన్ను ఓడించింది..అంటూ స్పోర్టివ్ గా బాగ్ కు విషెష్ చెప్పారు నవీన్ పట్నా యక్.
ఇటీవల జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో కాంతాబంజీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అయిన బాగ్ .. పట్నాయక్ పై 16వేల ఓట్ల తేడాతో విజయం సాధిం చారు. పట్నాయక్ ఈ స్థానం నుంచి ఓడిపోయినప్పటికీ హింజలి స్థానం నుంచి గెలుపొందారు.
మంగళవారం (జూన్ 18) ప్రారంభమైన ఒడిశా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్బంగా ఈ ఆసక్తికర సన్ని వేశం చోటు చేసుకుంది.
ఒడిశాలో 24 ఏళ్ల బీజేడీ పాలనకు ముగింపు పలికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 78 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.. బీజేడీ 51, కాంగ్రెస్ 14, సీపీఐ(ఎం)1, ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. గత అసెంబ్లీలో బీజేడీకి 113 మంది ఎమ్మెల్యే ఉన్నారు.
