- మంత్రి పొన్నంను కోరిన మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్
హైదరాబాద్, వెలుగు : వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. సోమవారం సురేశ్ షెట్కార్ ఆధ్వర్యంలో లింగాయత్ స్టేట్ ప్రెసిడెంట్ సంగమేశ్వర్‌తో
పాటు పలువురు నేతలు మంత్రి పొన్నంను కలిశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని ఈ సందర్భంగా మంత్రి వారికి హామీ ఇచ్చారు.
