చెరో రూ.5 లక్షలు ఇస్తా : మైనంపల్లి హన్మంతరావు

  • బాధిత కుటుంబాలకు మైనంపల్లి హామీ

కొల్చారం, వెలుగు: మెదక్​జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్​లో కరెంట్​షాక్​ తో మృతి చెందిన నవీన్​, ప్రసాద్​ కుటుంబాలను కాంగ్రెస్​సీనియర్​నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు​శుక్రవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు సొంతంగా చెరో రూ.5 లక్షల సాయం చేస్తానని చెప్పారు. ప్రభుత్వ సాయం త్వరగా అందేలా కృషి చేస్తానన్నారు.

చేతనైతే బాధిత కుటుంబాలకు సాయం చేయాలి కానీ ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు.  ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​ఆంజనేయులు గౌడ్, కిసాన్​సెల్​ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్​రెడ్డి, సుప్రభాత్​రావు, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ ఉన్నారు.