పార్టీలో పంచాయితీలు పెట్టేందుకు చూస్తున్నరు : హన్మంతరావు

  • కాంగ్రెస్ నేత హన్మంతరావు 

సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేట గడ్డమీద 40 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న నాయకులు పార్టీలో పంచాయితీలు పెట్టేందుకు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గడ్డం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన మెగా క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్​లో 250 టీములు 60 రోజులపాటు పాల్గొంటాయని తెలిపారు. సిద్దిపేటలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా పూజల హరికృష్ణ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా నడుద్దామని పిలుపునిచ్చారు. సంక్రాంతికి ఫైనల్ మ్యాచ్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో  దుబ్బాక నియోజకవర్గ ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, తాడూరి శ్రీనివాస్ గౌడ్, గంప మహేందర్, గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి, యాదగిరి, అత్తూ ఇమామ్ పాల్గొన్నారు.