చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్ లెవెల్ అవినీతికి పాల్పడ్డారు: పేర్ని నాని

సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ఇటీవల వెలుగులోకి వచ్చిన అదానీ స్కాం గురించి మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని.  అదానీతో తాము ఒప్పందాలు చేసుకోలేదని.. అదానీని అరెస్ట్ చేస్తే అప్పటి కేంద్రమంత్రి,సెబీ చైర్మన్‌ను తీసుకువెళ్తారు కానీ..  జగన్‌కు ఏం సంబంధం ఉందని అన్నారు.చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్ లెవెల్ అవినీతిచేశారని అన్నారు పేర్ని నాని.

సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అరెస్టు గుర్తులేదా అంటూ ప్రశ్నించారు .విద్యుత్ చార్జీలపై కేంద్ర ప్రతిపాదనలకు అంగీకరిస్తే వైసీపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాలుగుసార్లు సీఎంగా ఉన్నందుకు అప్పులే మిగిలాయని అన్నారు. చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తారని..  జగన్‌పై టీడీపీ నేతలు విషం చిమ్ముతున్నారని అన్నారు నాని. వైసీపీకి 40 శాతం ఓటింగ్‌ రావటంతో.. ఆ ప్రజాదరణను చంపాలని చంద్రబాబు [ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు పేర్ని నాని.