పెండింగ్ పనులు చేపట్టాలని వినతి : మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి

వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గంలో పెండింగ్​లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టర్  ఆదర్శ్  సురభిని కలిశారు. రైతుల ప్రయోజనాల కోసం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎలాంటి మార్పులు లేకుండా యధావిధిగా చేపట్టాలని కోరారు. ఖిల్లాగణపూర్, బుద్దారం చెరువుల పనులను కొత్త ప్రభుత్వం కొన్ని మార్పులు చేయడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు.

మామిడిమాడ రిజర్వాయర్ ను పూర్తి చేయాలని, రూ. 50 కోట్లతో చేపట్టే రామన్నగుట్ట రిజర్వాయర్,  కాశీంనగర్, రేమద్దుల, అంజనగిరి పరిధిలో పనులకు టెండర్లు పిలవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, బి.లక్ష్మయ్య, సామ్యనాయక్, రఘుపతిరెడ్డి, కరుణశ్రీ, కర్రెస్వామి, లక్మారెడ్డి, నందిమల్ల అశోక్  పాల్గొన్నారు.